Hotel Room : బెంగళూరులోని హోటల్ గదిలో శవమై కనిపించిన ఉజ్బెకిస్థాన్ మహిళ

ఉజ్బెకిస్థాన్‌కు (Uzbekisthan) చెందిన 37 ఏళ్ల మహిళ మార్చి 13న బెంగళూరులోని తన హోటల్ గదిలో శవమై కనిపించిందని పోలీసులు తెలిపారు. మార్చి 5న బెంగళూరుకు వచ్చిన జరీన్ అనే మహిళ.. నగరంలోని శేషాద్రిపురం ప్రాంతంలోని ఓ హోటల్‌లో బస చేసింది. సాయంత్రం 4:30 గంటలకు హోటల్ సిబ్బంది తలుపు తట్టారని, అయితే ఎటువంచటి స్పందన లేదని పోలీసులు తెలిపారు. దీంతో సిబ్బంది మాస్టర్ కీని ఉపయోగించి తలుపులు తెరిచి చూడగా జరీన్ మృతి చెందింది.
ఆమెను ఎవరో పొట్టన పెట్టుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు బెంగళూరు సెంట్రల్ డీసీపీ శేఖర్ హెచ్‌టీ తెలిపారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బౌరింగ్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. "జరీన్ ఒక హోటల్‌లోని గదిలో శవమై కనిపించింది. ఆమె బహుశా ఉక్కిరిబిక్కిరి చేయబడి ఉండవచ్చు. సంఘటన జరిగినప్పుడు ఆమె ఒంటరిగా ఉందని మాకు అర్థమవుతోంది" అని DCP జోడించారు.
ఫోరెన్సిక్ బృందం, పోలీసులు, డాగ్ స్క్వాడ్ విచారణ కోసం జరీన్ గదికి చేరుకున్నారు. హోటల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ, హోటల్ రిజిస్టర్‌ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమె వీసాపై వచ్చారా లేదా ఇక్కడే ఎక్కువ కాలంగా ఉంటోందా అన్న విషయాలపై, ఆమె పాస్‌పోర్ట్‌ను పోలీసులు దర్యాప్తు చేస్తారని DCP శేఖర్ హెచ్‌టి చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com