Trains Cancelled: వందేభారత్ సహా 22 రైళ్ల రద్దు
By - Manikanta |28 Jun 2024 6:10 AM GMT
ఉత్తరాదిన వందే భారత్ తో సహా 22 రైళ్లు రద్దయ్యాయి. దాదాపు 18 రైళ్ల మార్గాలను మార్చారు. గురువారం నుంచి రూర్కీ రైల్వే స్టేషన్ లో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు ప్రారంభం కావడంతో రైల్వే అదికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పనులు వారం రోజులు జరుగుతాయి.
దాంతో హరిద్వార్, రిషికేశ్ కు ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఉత్తరాఖండ్ లోని రూర్కీ నుంచి వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ జులై 1 నుంచి 3వ తేదీ వరకు రద్దయింది. అలాగే కొన్ని రైళ్లను ఏడు రోజులు, మరికొన్ని మూడు రోజుల పాటు రద్దు చేశారు.
రూర్కీలో వారం రోజుల పాటు నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు న్యూ ఢిల్లీ రైల్వే శాఖ తెలిపింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com