Vishal : సినిమాల్లో కంటే బయటే విలన్లు ఎక్కువ: విశాల్

తనకు సినిమాల్లో కంటే బయటే విలన్లు ఎక్కువగా ఉన్నారని హీరో విశాల్ అన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘రత్నం’ సినిమా తర్వాత స్వీయ దర్శకత్వంలో తుప్పరివాలన్-2 మూవీ చేయనున్నట్లు తెలిపారు. మే 5న ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చెప్పారు. కొత్తగా ఏం చేస్తాడని అనుకునేవారి కోసమే ఈ సినిమా చేస్తున్నానన్నారు. కాగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రత్నం’ మూవీ ఈ నెల 26న థియేటర్లలో విడుదల కానుంది.
కాగా ‘రత్నం’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విశాల్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. త్వరలో తాను రాజకీయాల్లోకి వవస్తానని.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నానని మొన్న విశాల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
సరైన వసతులు లేకపోవడంతో రాష్ట్రంలోని ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారందరికీ సేవ చేయడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే తన ఉద్దేశం అని.. ఈ కారణంతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు విశాల్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com