BJP : క్షత్రియుల ఆగ్రహం.. ఉత్తరాదిలో బీజేపీకి భారీ దెబ్బ!

BJP : క్షత్రియుల ఆగ్రహం.. ఉత్తరాదిలో బీజేపీకి భారీ దెబ్బ!

2014, 2019లో సొంతగా మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లకు పైగా సాధించింది బీజేపీ. ఈ సారి మాత్రం 240కి మాత్రమే పరిమితమైంది. అధికారం కోసం తెలుగుదేశం, జేడీయూ పార్టీలపై ఆధారపడాల్సి వచ్చింది. ఉత్తర భారతదేశంలో తిరుగులేకుండా ఉన్న బీజేపీని క్షత్రియ కమ్యూనిటీ అసమ్మతి కొంపముంచిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

క్షత్రియ సామాజిక వర్గంలోని ఆగ్రహం వల్లే బీజేపీ సొంతగా మెజారిటీ సాధించలేదని తెలుస్తోంది. బీజేపీ నాయకుడు పురుషోత్తమ్ రూపాల వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆ కమ్యూనిటీలో ఆగ్రహావేశాలకు కారణమైంది. క్షత్రియుల చరిత్రను వక్రీకరించడంతో పాటు అగ్నివీర్ పథకం, ఇతర కీలకమైన సమస్యలు కూడా బీజేపీ తక్కువ సీట్లు సాధించేందుకు కారణమైంది. ఎన్నికల ముందు ఈ వర్గం దేశవ్యాప్తంగా మహాపంచాయత్ నిర్వహించి, బీజేపీకి వ్యతిరేకం తీర్మానాలు చేయడం కూడా సంచలనం రేపింది.

దార్ సామాజిక వర్గానికి చెందిన రుపాలా మార్చి 22న వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పూర్వపు మహారాజులు.. బ్రిటిష్ వారితో సహా విదేశీ పాలకుల అణచివేతకు లొంగిపోయారు. వారితో కలిసి భోజనం చేసి మహారాజులు తమ కుమార్తెలను విదేశీయులకు ఇచ్చి వివాహం జరిపించారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాజులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలిపారు. తన వ్యాఖ్యలకు రూపాల పలు మార్లు క్షమాపణలు చెప్పినా కూడా క్షత్రియుల ఆగ్రహం తగ్గలేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రూపాలా మాత్రం బనస్కాంత స్థానం నుంచి గెలుపొందారు. క్షత్రియుల ఆందోళనలు జరిగిన రాజస్థాన్లోని ఏడు చోట్ల బీజేపీ ఓడిపోయింది. రాజపుత్ వర్గాలకు సరైన సీట్లు ఇవ్వకపోవడం, రాజ్ పుత్ లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే శుభకరన్ చౌదరి వంటి నాయకులకు టికెట్లు ఇవ్వడం క్షత్రియ కమ్యూనిటీకి నచ్చ లేదు. ఈ వర్గం కూడా బీజేపీ నుంచి దూరమైంది. రాజ్ పుత్ వర్గాల అభ్యర్థులకు బదులుగా ఇతర ఓబీసీ అభ్యర్థులకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నిర్దిష్ట వర్గానికి మాత్రమే కీలక పదవులు ఇవ్వడం.. క్షత్రియ వర్గాన్ని బీజేపీకి దూరం చేసిందన్న విశ్లేషణలు ఉన్నాయి.

Tags

Next Story