PM Modi : మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం : మోదీ
నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లందరూ భాగం కావాలని ప్రధాని మోదీ కోరారు. 96 లోక్‌సభ నియోజకవర్గాల్లోని ఓటర్లు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటారని, యువత, మహిళలు దీనికి బలం చేకూరుస్తారని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు.
ఐదేళ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వ సుపరిపాలన చూశారని సీఎం జగన్ అన్నారు. ప్రజలు తమ భవిష్యత్తు కోసం ఓటు వేస్తారని పులివెందులలో మాట్లాడారు. మరోవైపు ఓటు జీవితాన్ని మారుస్తుందని ఉండవల్లిలో ఓటు వేసిన అనంతరం టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగమవ్వాలని.. ఎవ్వరూ అశ్రద్ధ చేయొద్దని కోరారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ వేళ పలు ప్రాంతాల్లో పవర్ కట్ కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తెలంగాణలోని కొమురం భీం(D) ఆసిఫాబాద్‌లో పవర్ కట్ వల్ల ఇంకా పోలింగ్ ప్రారంభం కానట్లు తెలుస్తోంది. రాత్రి నుంచి అక్కడ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. మరోవైపు ఏపీలోని అనంతపురం(D) రాయదుర్గంలో మాక్ పోలింగ్ నిలిచిపోయింది. భారీ వర్షం, పవర్ కట్‌తో పోలింగ్ సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com