Amit Shah : పీవోకేను తప్పక స్వాధీనం చేసుకుంటాం: అమిత్ షా

పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. పీవోకేను పాకిస్థాన్ నుంచి తిరిగి తీసుకుంటామని మరోసారి స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పామని చెప్పారు. పీవోకేలో ప్రజలు కూడా తమను భారత్‌లో విలీనం చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. అక్కడి ప్రజలకు విముక్తి కల్పిస్తామని పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా తొలి రెండు విడతల్లో పోలింగ్ శాతం తగ్గడంపై తొలుత తానూ ఆందోళన చెందానన్నారు కేంద్రం హోంమంత్రి అమిత్ షా. కానీ 3వ విడతలో తన నియోజకవర్గమైన గాంధీనగర్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులు గమనించాక అనుమానాలు తొలగిపోయాయని తెలిపారు. ఓటమి తప్పదనే భయంతో కాంగ్రెస్ ఓటర్లు పోలింగ్‌కు దూరమయ్యారని, అందుకే పోలింగ్ కాస్త తగ్గినట్లు పేర్కొన్నారు. NDA 400 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఒక జాతీయ పార్టీ అధినేతగా ఉన్న ఆయన.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ సుప్రీంకోర్టు జూన్ 1 వరకు బెయిల్ మంజూరుచేసింది. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు అసాధారణంగా కనిపిస్తోందన్నారు. ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com