ఈ ఏడాది సమృద్దిగానే వర్షాలు : అధికారుల అంచనా

ఈ ఏడాది కురిసే వర్షాలపై వాతావరణ శాఖ పలు కీలక విషయాలు వెల్లడించింది. ఈ సంవత్సరం
మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎల్‌నినో పరిస్థితులు ఈ ఏడాది జూన్ నాటికి బలహీనం అవుతాయని, ఫలితంగా భారత్‌లో వచ్చే రుతు పవన కాలంలో సమృద్ధిగానే వర్షాలు పడే అవకాశం ఉన్నదని అంటున్నారు. ఎల్‌నినో పరిస్థితుల బలహీనం ప్రారంభం అయిందని, ఆగస్టు నాటికి లానినా పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నదని తాజాగా పేర్కొన్నారు.
2023 కంటే ఈసారి రుతుపవన వర్షాలు మెరుగ్గానే పడుతాయని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ (Madhavan Rajeevan) పేర్కొన్నారు. నైరుతి రుతు పవనాల సమయంలో పడే వర్షాలు దేశ వ్యవసాయ రంగానికి కీలకం. కావున తాజాగా వాతావరణ అధికారులు చెబుతున్న విషయాలు రైతులకు కాస్త ఊరట కలిగిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com