Mmata Benarjee : మమతా బెనర్జీకి గాయం ఎలా అయిందంటే..?

Mmata Benarjee : మమతా బెనర్జీకి గాయం ఎలా అయిందంటే..?
X

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను కోల్కతాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న SSKM హాస్పిటల్ లో చేర్పించారు. సీఎం మమత బెనర్జీకి తీవ్ర గాయమైందని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ట్విట్టర్ లో తెలిపింది. నుదుటన గాయం, ముఖంపై రక్తం ధారగా కారుతున్న ఆమె ఫొటోలను కూడా షేర్ చేశారు. సీఎం త్వరగా కోలుకోవాలని ప్రేయర్స్ చేయాలని ఆ పార్టీ అభిమానులను కోరింది. ట్రెడ్ మిల్ పై ఆమె వాకింగ్ చేస్తుండగా అదుపు తప్పి పడిపోయారని టీఎంసీ తెలిపింది. మెషిన్ కు ఉన్న పదునైన ఐరన్ కొన నుదుటన గుచ్చుకోవడంతో మమత తీవ్రంగా గాయపడ్డారని పేర్కొంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. ఈ ఫోటోలు చూసి అందరూ షాక్ అయ్యారు. సీఎం మమత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Tags

Next Story