Voting : మీ ఓటు వేరే వాళ్లు వేస్తే ఏం చేయాలి?

Voting : మీ ఓటు వేరే వాళ్లు వేస్తే ఏం చేయాలి?

మీ ఓటును వేరే వాళ్లు వేసినట్లు గుర్తిస్తే వెంటనే ప్రిసైడింగ్ అధికారిని కలవాలి. ఓటర్ ఐడీ లేదా మరేదైనా గుర్తింపు పత్రం సమర్పించాలి. అధికారి ఇచ్చే ఫామ్ 17(బి) పై పేరు రాసి, సంతకం చేయాలి. ఆ తర్వాత టెండర్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. దానిపై ఓటు వేయాలి. ఆ పేపర్‌ను ప్రత్యేక కవర్‌లో కౌంటింగ్ కేంద్రానికి పంపిస్తారు. సెక్షన్ 49(పి) ప్రకారం పొందే ఈ ఓటును టెండర్/ఛాలెంజ్ ఓటు అంటారు. దీనిని EVM ద్వారా వేయడం కుదరదు.

* పోలింగ్ బూత్‌లో వీడియో/ఫొటోలు తీయకూడదు.

* పోలింగ్ రోజున మీరు ఎవరికి ఓటు వేశారో సోషల్ మీడియాలో వెల్లడించకూడదు.

* పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ఇతరులకు సహకరించండి.

* ఓటర్ కార్డు లేదా ఈసీ సూచించిన 12 డాక్యుమెంట్లలో ఒకటైనా వెంట తీసుకెళ్లండి.

* క్యూ పద్ధతి పాటిస్తూ, మీ సమయం కోసం వేచి ఉండండి.

* పోలింగ్ సిబ్బంది పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించండి.

ఎవరైనా ఓ వ్యక్తి దొంగ ఓటు వేయడానికి వచ్చారని పోలింగ్ ఏజెంట్లకు అనుమానం కలిగితే వారు ఆ వ్యక్తి గుర్తింపును సవాల్ చేస్తారు. ఇందుకోసం ప్రిసైడింగ్ అధికారికి రూ.2 డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. అనంతరం ఆ అధికారి విచారణ చేపడతారు. దొంగ ఓటు వేయడానికి వచ్చారని తేలితే సదరు వ్యక్తిని అక్కడున్న పోలీసులకు అప్పగించి, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తారు. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేస్తారు.

Tags

Next Story