Election Deposit : ఎన్నికల్లో డిపాజిట్ అంటే ఎంటీ? ఎప్పుడు గల్లంతవుతుంది?

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఫలానా అభ్యర్థికి డిపాజిట్ కూడా దగ్గలేదట.. డిపాజిట్ గల్లంతైన అభ్యర్థులు.. అనే మాటలు తరుచూ వినిపిస్తాయి. డిపాజిట్ అంటే ఏమిటీ? ఎప్పుడు గల్లంతవుతుంది? అనేది తెలుసుకుందాం.. నామినేషన్లు వేసినప్పుడు అభ్యర్థులు కొంత నగదును చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఆ డబ్బును ఎన్నికల ఫలితాలు విడుదలైన అభ్యర్థులకు తమ ధరావతు (డిపాజిట్) తిరిగి వస్తే అది గౌరవప్రదమైన ఓటమిగా లెక్కిస్తారు.
అదే డబ్బులు తిరిగి రాకపోతే అభ్యర్థి డిపాజిట్ గల్లంతైందని అర్థం. ఆయా ఎన్నికలకు ఎన్నికల సంఘం డిపాజిట్ ఇంతా అని నిర్ణయిస్తుంది. ఈ మొత్తాన్ని ఆర్‌ఓ ఖజానాశాఖలో తెరిచిన ఖాతాలో జమ చేస్తారు. నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థి మొత్తం పోలైన ఓట్లలో ఆరో వంతు (16 శాతం) ఓట్లను పొందాల్సిన అవసరం ఉంటుంది.
ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో వెయ్యి ఓట్లే వేశారనుకుంటే ఇందులో 160 ఓట్ల కన్నా ఎక్కువ సాధించాల్సి ఉంటుంది. 16శాతం కన్నా ఎక్కువ ఓట్లు వస్తే డిపాజిట్‌గా చెల్లించిన డబ్బులను తిరిగి ఇస్తారు. లేనట్లయితే ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంటుంది. స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా డిపాజిట్లు కోల్పోవడం సర్వసాధారణం
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com