Fourth Phase Polling : నాలుగో విడతలో పోలింగ్ శాతం ఎంతంటే

Fourth Phase Polling : నాలుగో విడతలో పోలింగ్ శాతం ఎంతంటే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిన్న నాల్గవ దశ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. రాత్రి 11.45 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్‌ వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలో 78.25శాతం, బిహార్‌లో 57.06, జమ్మూకశ్మీర్‌లో 37.98, ఝార్ఖండ్‌లో 65.31, ఎంపీలో 70.98, మహారాష్ట్రలో 59.64, ఒడిశాలో 73.97, తెలంగాణలో 64.93, యూపీలో 58.05, పశ్చిమ బెంగాల్‌లో 78.44 శాతం పోలింగ్ నమోదైంది.

పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లకు మించి రావని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంచనా వేశారు. బీజేపీని ప్రజలు ‘ప్రజాస్వామ్యానికి ముప్పు’గా పరిగణిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలను జైళ్లకు పంపడంతో పాటు ఎన్నికల సమయంలో నిధులు అందకుండా చేయడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచాయన్నారు. బీజేపీ మత ప్రచారం కూడా ఆ పార్టీకి చేటు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story