Delhi : ఢిల్లీ బీసీ ధర్నాలో ఏ యే పార్టీలు పాల్గొన్నాయంటే!

బీసీ గర్జనపోరుకు ఇండియా కూటమి పార్టీలు మద్దతు తెలిపాయి. డీఎంకే, ఎన్సీపీ, ఎస్పీ, ఆర్జేడీ తదితర పార్టీల నేతలు ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ ఒంటరి కాదని, మహారాష్ట్ర నుంచి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. జై మహారాష్ట్ర, జై తెలంగాణ, జై సంవిధన్ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పటి నుంచి తనకు తెలుసునన్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి అయి, అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతా అంటూ ఎప్పుడూ చెబుతుండే వారని గుర్తు చేసుకున్నారు. నాడు చెప్పినట్లుగానే ఇప్పుడు సీఎం అయ్యి చేసి చూపిస్తున్నారని కితాబిచ్చారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ చేసారనిచెప్పారు.
కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకార్, కొండా సురేఖ, విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, చామల, కావ్య, సురేశ్ షట్కర్, రేణుకా చౌదరి, రఘురాం రెడ్డి, కుమారీ షెల్టా, ప్రీతి షిండే, అమర్ సింగ్, ప్రభా(కర్ణాటక), కాంగ్రెస్ నేతలు విజయ శాంతి, అద్దంకి దయాకర్, సంపత్ కుమార్, వీహెచ్, ఎమ్మెల్సీ కొదండ రాం, సినీ నటుడు సుమన్, సీపీఐ నుంచి నారాయణ, డిఎంకే నుంచి విల్సన్, కళిమెళి, నరేష్ ఉత్తమ్ పాటిల్(ఎస్పీ), సుప్రియా సూలే (ఎస్సీపీ), ఎంపి అసదుద్దీన్ (ఎంఐఎం), మనోజ్ ఝా(ఆర్జేడీ), మహారాష్ట్ర నుంచి ఎంపీ గైక్వాడ్, పంజాబ్ పీసీసీ అమరన్ సింగ్, బీసీ నేతలు గుజ్జ కృష్ణ, బొంతు రామ్మోహన్, చిన్న శ్రీశైలం, కార్పొరేషన్ చైర్మన్లు జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మెట్టు సాయితో పాటు పలువురు హాజరయ్యారు. తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎంపీలు సైతం పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com