PM Modi : మోదీ ప్రమాణ స్వీకారానికి చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?
మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆదివారం ముహూర్తం కుదిరిందని సమాచారం. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ అధినేతలు రానున్నారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జును కేంద్రం ఆహ్వానించడం హాట్ టాపిక్ అయింది.
దౌత్యపరమైన ఒడుదొడుకులు కొనసాగుతోన్న తరుణంలో ఈ ఆహ్వానం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫలితాలు వెల్లడయ్యాక.. మాల్దీవుల అధ్యక్షుడు మోడీకి విషెస్ పంపించారు. భారత్, మాల్దీవుల ప్రజల శ్రేయస్సు, ప్రయో జనాల కోసం కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సందేశం పంపారు.
ఈ ఏడాది ప్రారంభంలో లక్షద్వీప్ ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించి టూరిజాన్ని ప్రమోట్ చేశారు. దీనిపై మాల్దీవులు మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. ఈ తర్వాత రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఒడుదొడుకులు చోటుచేసుకున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com