BJP : రామమందిరం సీటును బీజేపీ ఎందుకు కోల్పోయిందంటే?

BJP : రామమందిరం సీటును బీజేపీ ఎందుకు కోల్పోయిందంటే?

భారత లోక్ సభ ఎన్నికల్లో 543 స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 292 స్థానాలను కైవసం చేసుకుంది. మెజారిటీ మార్క్ 272 కన్నా కేవలం 20 సీట్లను అధికంగా కూటమి సాధించింది. గతంలో 2014, 2019లో రెండుసార్లు బీజేపీ స్వత హాగానే 272 మార్కును దాటి సీట్లను సాధించింది. అయితే, ఈ సారి మాత్రం ప్రభుత్వ ఏర్పాటు కోసం భాగస్వామ్య పక్షాలైన తెలుగు దేశం, జేడీయూలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.

ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీకి సీట్లు తగ్గడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని తెలుస్తోంది. యూపీలో 80 సీట్లు ఉంటే కేవలం 36 సీట్లను మాత్రమే బీజేపీ సాధించింది. కాంగ్రెస్ కూటమి 43 స్థానాలను దక్కించుకుని షాకిచ్చింది. హిందువుల 500 ఏళ్ల కల అయిన రామ మందిరాన్ని నిర్మించిన బీజేపీ, రామ మందిరం ఉన్న ఫైజాబాద్ ఎంపీ స్థానంలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం కాషాయ పార్టీకి అతిపెద్ద షాక్ గా మారింది. జనవరి 22న రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసిన 4 నెలలకే బీజేపీ అక్కడ ఓడిపోవడం విశ్లేషకుల అంచనాకు కూడా అందడం లేదు.

అయోధ్య ఉన్న ఫైజాబాద్ లో ఎస్పీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్, బీజేపీ నేత లల్లూ సింగ్ ను ఓడించారు. దీనికి 100 కి.మీ దూరంలో ఉన్న శ్రావస్తిలో కూడా రామ మందిరంతో సంబంధం ఉన్న వ్యక్తి ఓడిపోయాడు. శ్రావస్తీ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా సాకేత్ మిశ్రా బరిలో దిగారు. ఈయన రామమందిరం నిర్మించే ట్రస్టుకు నేతృత్వం వహిస్తున్న నృపేంద్ర మిశ్రా కుమారుడు. ఇతడిని ఎస్పీకి చెందిన రామ్ శిరోమణి వర్మ ఓడించారు. ఓటమికి కారణాలపై బీజేపీ ఇప్పటికీ విశ్లేషిస్తూనే ఉంది.

Tags

Next Story