Priyanka Gandhi : అందుకే ప్రియాంక గాంధీ పోటీ నుంచి తప్పుకున్నారా?

రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల్లో ఏదో ఒకచోట నుంచి పోటీ చేయాలన్న ఖర్గే సూచనను ప్రియాంక గాంధీ తిరస్కరించారు. గాంధీ కుటుంబానిది వారసత్వ రాజకీయాలంటూ ఎప్పటినుంచో బీజేపీ విమర్శలు చేస్తూ వస్తోంది. దీంతో ఇప్పటికే తల్లి సోనియా, సోదరుడు రాహుల్ ఎంపీలుగా ఉండగా తానూ గెలిచి పార్లమెంట్‌కు వెళ్తే ఆ విమర్శలకు మరింత బలం చేకూర్చినట్లవుతుందని ఆమె చెప్పినట్లు సమాచారం. అందుకే పోటీ చేయబోనని స్పష్టం చేశారట ప్రియాంక.
రాయ్‌బరేలీ, అమేథీ సీట్ల ప్రకటన తర్వాత ప్రియాంకాగాంధీ ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అమేథీలో కిషోరిలాల్ శర్మను అభ్యర్థిగా నిలబెట్టడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. కిషోరి లాల్ శర్మతో తమ కుటుంబానికి సుదీర్ఘ అనుబంధం ఉందని గుర్తుచేశారు. అమేథీ, రాయ్‌బరేలీ ప్రజలకు సేవ చేయడానికి ఆయన ఎల్లప్పుడూ అంకితభావంతో ఉంటారని తెలిపారు. ప్రజాసేవ పట్ల ఆయనకున్న మక్కువ ఉందని చెప్పడానికి శర్మనే ఉదాహరణ అని ప్రియాంక చెప్పారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలో వాయనాడ్ నుంచి కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే వాయ్ నాడ్ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాయ్ బరేలీ సీటు కాంగ్రెస్ కు కంచుకోట. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచారు AICC మాజీ చీఫ్ సోనియాగాంధీ. ప్రస్తుతం ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న సోనియా... రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com