Rahul Gandhi Comments : మోడీకి వంగి వంగి సలాములు ఎందుకు? రాహుల్ కామెంట్స్ వైరల్

Rahul Gandhi Comments : మోడీకి వంగి వంగి సలాములు ఎందుకు? రాహుల్ కామెంట్స్ వైరల్
X

లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) చేసిన కామెంట్స్ రాజకీయ సంచలనం రేపుతున్నాయి. గంట సేపు పలు అభ్యంతరాలు, నిరసనల మధ్య మాట్లాడిన రాహుల్ గాంధీ.. అనేక అంశాలను లేవనెత్తారు. నరేంద్ర మోడీ ( Narendra Modi ), తనతో స్పీకర్ ఓం బిల్లా ( Om Birla ) చూపిన ప్రవర్తనను రాహుల్ గాంధీ ఎత్తిచూపారు.

స్పీకర్ గా ఎన్నికైన అనంతరం స్పీకర్ సీట్ వద్దకు తోడ్కొని వచ్చిన సందర్భంలో మోడీతో వంగి నమస్కరించిన మీరు.. నాతో మాత్రం నిటారుగా నిల్చుండి కరచాలనం చేశారని గుర్తుచేశారు. ఇది స్పీకర్ పదవిలో ఉన్న తమరికి సరైంది కాదని, ఇది ఇద్దరి పట్ల మీరు చూపుతున్న తీరుకు నిదర్శ నమని రాహుల్ అన్నారు.

దీనికి ఓం బిర్లా స్పందించారు. పెద్దల ముందు తలవంచడం మన సంస్కృతిలో భాగమని, అందుకే మోడీతో కరచాలనం చేసేప్పుడు వంగిన ఓం బిర్లా చెప్పారు. దీనిపై రాహుల్ మరోసారి స్పందిస్తూ.. పార్లమెంట్లో స్పీకర్ అత్యున్నత పదవి అని గుర్తుచేశారు.

Tags

Next Story