ED : కవితను, కేజ్రీవాల్ ను కలిపి విచారిస్తారా.?

ED : కవితను, కేజ్రీవాల్ ను కలిపి విచారిస్తారా.?

ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Scam) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగుస్తుంది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఆమెను ఇవాళ మధ్యాహ్నం మరోసారి రౌస్ ఎవెన్యూలోని స్పెషల్​ కోర్టులో హాజరుపరచనున్నారు. కవిత ఈడీ కస్టడీ పొడగింపు లేదా జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరనుంది.

లిక్కర్ స్కామ్​లో ఈ నెల 15న కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అదే రోజు ఢిల్లీలోని ఈడీ హెడ్ ఆఫీస్ కు తరలించారు. రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు వారం రోజుల కస్టడీ విధించింది. ఇది ఇలా ఉండగా నిన్న సాయంత్రం ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఆమె కొడుకు ఆర్య,ఇతర బంధువులు, న్యాయవాది కలిసి మాట్లాడారు. తన కొడుకును చూసిన కవిత త్వరగానే ఇంటికి వస్తానని బాధ పడవద్దు అంటూ ధైర్యం చెప్పారు. కవిత బెయిల్ పిటిషన్ ను నిన్న సుప్రీంకోర్టు కొట్టేసింది.బెయిల్ కోసం ట్రయల్ రన్ కోర్టుకే వెళ్లాలని సూచించింది.

మరో వైపు నిన్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు 6 రోజుల కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో కవిత, కేజ్రీవాల్​ను కలిపి విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. లిక్కర్ స్కామ్​లో సౌత్ గ్రూప్ నుంచి కవిత కింగ్ పిన్​గా వ్యవహరించారని.. పాలసీ అమలులో కేజ్రీవాల్ కీ రోల్ పోషించారని ఈడీ కోర్టుకు తెలిపింది. అందువల్ల వీరిద్దరిని కలిపి విచారిస్తే స్కామ్​కు సంబంధించిన అన్ని వివరాలు బయటకు వస్తాయని భావిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story