Indore Airport : వావ్.. జీరోవేస్ట్ ఎయిర్ పోర్ట్‌గా ఇండోర్

Indore Airport : వావ్.. జీరోవేస్ట్ ఎయిర్ పోర్ట్‌గా ఇండోర్
X

మధ్యప్రదేశ్లోని ఇండోర్ విమానాశ్రయం దేశంలో మొదటి చెత్త రహిత విమానాశ్రయంగా ఘనత సాధించనుంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్ మోహన్ నాయుడు ఈ విమానాశ్రయంలో చెత్తను రీ సైక్లింగ్ చేసే ప్లాంట్ ను రెండు రోజుల క్రితం ప్రారంభించారు. పార్లమెంటు సభ్యుడు శంకర్ లాల్వానీ విలేఖరులతో మాట్లాడుతూ ఇండోర్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆచరిస్తున్నామని విలేఖరులతో చెప్పారు. చెత్తను బంగారం గా మార్చాలన్న ప్రధానమంత్రి పిలుపును తాము పాటిస్తు న్నామని చెప్పారు. ఈ లక్ష్యంలో భాగంగానే ఇక్కడి విమానాశ్రయాన్ని జీరో వేస్ట్ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతు న్నామని చెప్పారు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రిస్టోర్ అనే భావంతో తాము చెత్తనుంచి ఉపయోగపడే ఉత్పత్తు లను తయారు చేస్తున్నామని చెప్పారు. ఇండోర్ విమానాశ్రయంలో తడి,పొడి చెత్తను వేరు చేసి వాటిని రీసైక్లింగ్ చేసేందుకు తగిన ప్లాంట్ని ఏర్పాటు చేసినట్టు లాల్వానీ తెలియజేశారు.

Tags

Next Story