YS Jagan Delhi Tour: గంటపాటు సాగిన మోదీ, జగన్‌ల సమావేశం.. పలు విషయాలపై చర్చ..

YS Jagan Delhi Tour: ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్... ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. మోదీని కలిసి కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధతపై నివేదించారు. అటు రెవెన్యూ లోటు, తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలపైనా చర్చించారు. మోదీ, జగన్‌ల సమావేశం గంటపాటు సాగింది.
అటు ప్రధాని మంత్రితో భేటీ అనంతరం ఐదుగురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు సీఎం జగన్. కేంద్రమంత్రులు నారాయణ రాణే, జితేంద్రసింగ్, నరేంద్ర సింగ్ తోమర్, నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్‌లను జగన్ కలిశారు. రాజధాని అమరావతిలో ఆయా మంత్రిత్వశాఖల కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నిర్మాణాలు... వీలైనంత త్వరగా చేపట్టాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com