Cricket : 100 శాతం ఫిట్​ గా ఉన్న : మహమ్మద్ షమీ

Cricket : 100 శాతం ఫిట్​ గా ఉన్న : మహమ్మద్ షమీ
X

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తన ఫిట్‌నెస్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చాడు. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత నుంచి షమీ ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ ఆటగాడు ఆస్ట్రేలియా టూర్ లో పార్టిసిపేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉన్న ఈ స్టార్ పేసర్ న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ముగిసిన తర్వాత ఆదివారం నెట్స్‌లో పూర్తిస్థాయిలో బౌలింగ్ చేశాడు. ఆస్ట్రేలియా కన్నా ముందే రంజీ ట్రోఫీలో ఆడాలని కోరుకుంటున్నాడు. షమీ మాట్లాడుతూ.. ’’నిన్న నెట్ లో ప్రాక్టీస్ చేస్తున్న విధానం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. నేను అంతకు ముందు హాఫ్ రన్- అప్ నుంచి బౌలింగ్ చేసేవాడిని ఎందుకంటే నేను ఎక్కువ లోడ్ తీసుకోకూడదనుకున్నాను. కానీ నిన్న పూర్తి స్థాయి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడు నేను 100 శాతం నొప్పి లేకుండా ఉన్నాను. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆడతానా లేదా చాలా మంది ఎప్పటినుంచో ఆడుతున్నారు. ప్రస్తుతం నా దృష్టంతా ఫిట్‌నెస్‌పై పెడుతున్నాను. ఆస్ట్రేలియా సిరీస్‌కు అవసరమైన బలం సమకూర్చుకుంటున్నాను. అక్కడ మనకు ఎలాంటి బౌలింగ్ ఎటాక్ నాకు అవగాహన ఉంది. అందుకే ముందుగా రంజీ ట్రోఫీలో కొన్ని మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నాను. దాని వల్ల ఎక్కువ టైం గ్రౌండ్ లో ఆడే అవకాశం దొరుకుతుంది’’ అని షమీ తెలిపాడు.

Tags

Next Story