T20 World Cup 2024 : అఫ్గానిస్థాన్ ఆశలు గల్లంతు.. ఫైనల్లో సౌతాఫ్రికా

T20 World Cup 2024 : అఫ్గానిస్థాన్ ఆశలు గల్లంతు..  ఫైనల్లో సౌతాఫ్రికా

అఫ్గానిస్థాన్ ఆశలు గల్లంతయ్యాయి. సెమీఫైనల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన సౌతాఫ్రికా ఫైనల్లో అడుగుపెట్టింది. అఫ్గాన్ నిర్దేశించిన 57 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 8.5 ఓవర్లలోనే ఛేదించింది. డికాక్ (5) ప్రారంభంలోనే ఔట్ అయినా కెప్టెన్ మార్క్రమ్ (23*), హెండ్రిక్స్ (29*) తమ జట్టుకు విజయాన్ని అందించారు. అంతకుముందు బ్యాటర్ల ఘోర వైఫల్యంతో అఫ్గాన్ 56 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా ఇవాళ రాత్రి 8 గంటలకు భారత్‌- ఇంగ్లాండ్‌ మధ్య సెమీఫైనల్‌-2 జరగనుంది. అందులో విజయం సాధించిన జట్టుతో శనివారం రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం) దక్షిణాఫ్రికా తలపడనుంది.

Tags

Next Story