Cricket Records : సిక్స్ బాల్స్ లో సిక్స్ సిక్సర్లు.. ఆంధ్ర ఓపెనర్ కొత్త రికార్డ్

క్రికెట్ లో రికార్డుల గురించి చదువుతుంటే ఆ కిక్కే వేరు. ఆరు బాల్స్ లో ఆరు సిక్స్‌లు కొట్టిన వాళ్లు చాలా అరుదు. ముందుగా యువరాజ్‌సింగ్ అందరికీ గుర్తొస్తాడు. తాజాగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లను బాదాడు ఆంధ్రా కుర్రాడు. కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ జాతీయ అండర్-2023 క్రికెట్ టోర్నీలో ఆంధ్ర ఓపెనర్ మామిడి వంశీ కృష్ణ 6 బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టాడు.
ఈ టోర్నీలో భాగంగా రైల్వేస్ జట్టుతో ఆదివారం ప్రారంభమైన మ్యాచ్‌లో వంశీ ఈ రికార్డు నమోదు చేశాడు. రైల్వేస్ లెగ్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ వేసిన 10వ ఓవర్లో వరుసగా 6 సిక్స్‌లను బాదాడు వంశీ. ఈ మ్యాచ్‌లో 64 బంతులను ఎదుర్కొన్న వంశీ కృష్ణ 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 110 పరుగులు చేశాడు. అయితే.. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు వంశీ కృష్ణ. ఇతని కంటే ముందే రవిశాస్త్రి, రుతురాజ్ గైక్వాడ్ భారత్ తరఫున ఈ ఫీట్‌ను క్రియేట్ ఏశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం భారత్ తరఫున దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ ఒక్కడే 6 బంతుల్లో ఆరు సిక్స్‌లో కొట్టాడు. 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్‌సింగ్ వరుసగా ఆరు సిక్స్‌లు కొట్టాడు యువరాజ్ సింగ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com