Virat Kohli Record : ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ పేరిట మరో రికార్డు

ఐపీఎల్‌లో అత్యధిక సార్లు(2) ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న భారత ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పారు. 2016లో 973 రన్స్, 2024 సీజన్‌లో 741 రన్స్ చేసి కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలిచారు. గతంలో వార్నర్ 3 సార్లు, గేల్ 2 సార్లు ఈ ఘనత సాధించారు. ఈ సీజన్‌లో వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ, ఎలిమినేటర్‌లో నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో కోహ్లీ మరో ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో 8000 పరుగుల మైలురాయిని దాటిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్‌లో 252 ఐపీఎల్ మ్యాచెస్ ఆడిన కోహ్లీ.. 38.67 సగటు, 131.97 స్ట్రైక్ రేట్‌తో 8004 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దీన్ని బట్టి.. కోహ్లీ ఈ ఐపీఎల్ ప్రారంభం నుంచి ఎంత నిలకడగా తన ప్రదర్శన కొనసాగిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. మరో విశేషం ఏమిటంటే.. కోహ్లీ రికార్డ్‌కి దరిదాపుల్లో ఏ ఇతర బ్యాటర్ లేడు. శిఖర్ ధావన్ 6769 పరుగులతో (222 మ్యాచెస్) రెండో స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ 6628 పరుగులతో (257 మ్యాచెస్) మూడో స్థానంలో ఉన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com