Athlete Gulveer Singh : అథ్లెట్ గుల్వీర్ సింగ్ నేషనల్ రికార్డ్

Athlete Gulveer Singh : అథ్లెట్ గుల్వీర్ సింగ్ నేషనల్ రికార్డ్
X

భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ గుల్వీర్ సింగ్ ( Gulveer Singh ) అరుదైన ఘనత సాధించాడు. 5000 మీటర్స్ రేసులో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. సోమవారం అమెరికా వేదికగా జరిగిన పోర్ట్ ల్యాండ్ ట్రాక్ ఫెస్టివల్ అథ్లెటిక్స్ మీట్లో పురుషుల విభాగం రిలే మీటర్స్ లో గుల్వీర్ సత్తా చాటాడు.

13:18.92 సెకన్లల్లో రేస్ ను పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. దాంతో పాటు గతేడాది అవినాష్ సాబ్లే (13:19.30 సెకన్లు) నెలకొల్పిన జాతీయ రికార్డును తాజాగా గుల్వీర్ సింగ్ బద్దలు కొట్టాడు. అలాగే 10వేల మీటర్ల రేస్ లోనూ జాతీయ రికార్డు గుల్వీర్ సింగ్ పేరిటే ఉంది. గుల్వీర్ ను ప్రముఖులు సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు.

Tags

Next Story