Cricket : ఆస్ట్రేలియా భారీ స్కోర్.. ఆలౌట్

Cricket : ఆస్ట్రేలియా భారీ స్కోర్.. ఆలౌట్
X

బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్సులో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ 140, లబుషేన్ 72, ఖవాజా 57, కొన్ట్సస్ 60, కమిన్స్ 49 పరుగులతో రాణించారు. బుమ్రా4 , జడేజా 3, ఆకాశ్ దీప్ 2, సుందర్ ఒక వికెట్ తీశారు.

టీమ్ ఇండియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో స్టీవ్ స్మిత్ సెంచరీ చేశారు. 167 బంతుల్లో శతకం చేశారు. ఈ సిరీస్‌లో ఆయనకిది రెండో సెంచరీ. మొత్తంగా భారత్‌పై 11వది. దీంతో టీమ్ ఇండియాపై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా చరిత్రకెక్కారు. టెస్టుల్లో 34 సెంచరీల మార్కును అందుకున్నారు.

బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజు భారత క్రికెటర్లు చేతికి నల్ల బ్యాండ్లతో కనిపించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానికి సంతాపంగా వీటిని ధరించారు. రెండో రోజు ఆటలో కమిన్స్(49) వికెట్‌ను జడేజా తీశారు. మరోవైపు సెంచరీ తర్వాత స్మిత్ దూకుడు పెంచారు. AUS స్కోరు 446/7.

Tags

Next Story