Cricket : కంగారూలు యమ డేంజర్.. నేటి మ్యాచ్ లో ఇండియాకు అలర్ట్

చాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య సెమీస్ ఫైట్ కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. ఐసీసీ టోర్నీల్లో అత్యంత ప్రమాదకరమైన జట్టేదైన ఉందంటే అది ఆస్ట్రేలియానే. అందుకే ఆసీస్ ను ఏ కోణంలోను తక్కువ అంచనా వేయకూడదని, ఆ జట్టులోని చవిరి ప్లేయర్ వరకు సాయశక్తుల పోరాడి తమ జట్టుకు విజయం సాధించిపెడతాడు. 2023 వన్డే వరల్డ్ కప్ గ్రూప్ దశలో తడబాటుకు గురైనా ఆసీస్. ఆ తర్వాత నాకౌట్స్ ఇరగదీసింది. ఆటోర్నీలో వరుసగా 10 విజయాలతో అజేయంగా నిలిచి ఫైనల్క అర్హత సాధించిన ఆతిథ్య టీమిండియాను తుది పోరులో చిత్తు చేసి ఆసీస్ విశ్వవిజేతగా అవతరించింది. ఇక ఈసారి స్టార్ ఆటగాళ్ల గైర్హాజరీలోనూ కంగారూ జట్టు మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. బౌలింగ్లో కాస్త వీక్ ఉన్నా.. బ్యాటింగ్ మాత్రం ఆసీస్ పటిష్టంగా ఉంది. ఇంగ్లండ్పై 350 ప్లస్ పరుగుల రికార్డు లక్ష్యాన్ని సైతం ఛేదించి సత్తా చాటింది. ఇప్పుడు రోహిత్ సేనకు కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు స్మిత్ బృందం రెడీ అయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com