T20 World Cup 2024 : వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు వెస్టిండీస్ షాక్

T20 World Cup 2024 : వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు వెస్టిండీస్ షాక్

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు వెస్టిండీస్ షాక్ ఇచ్చింది. ఆ జట్టును 35 పరుగుల తేడాతో చిత్తు చేసి మిగతా జట్లకూ హెచ్చరికలు పంపింది. పోర్టు ఆఫ్ స్పెయిన్ వేదికగా విండీస్-ఆసీస్‌ల మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా, ఫీల్డింగ్ ఎంచుకుంది. . తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 257/4 స్కోరు సాధించింది. పూరన్ (75), పావెల్ (52), రూథర్‌ఫర్డ్ (47) విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 222/7కే పరిమితమైంది. జోష్ ఇంగ్లిస్ (55) ఒక్కరే రాణించారు.వార్మప్ మ్యాచ్‌లో కంగారులు ఓడిపోవడం ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే మొదట్లో ఓటమి పాలవుతుందని, తర్వాత విశ్వరూపం చూపిందని అంటున్నారు.

Tags

Next Story