Pat Cummins : ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ .. అరుదైన రికార్డు

ఆస్ట్రేలియా (Australia) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) అరుదైన ఫీట్ సాధించాడు. కంగారూ జట్టు సారథిగా 100 వికెట్లు పడ గొట్టాడు. న్యూజిలాండ్ తో (New Zealand) జరుగుతున్న తొలి టెస్టులో డారిల్ మిచెల్ ను ఔట్ చేసిన కమిన్స్ 100 వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. దాంతో ఈ ఘనతకు చేరువైన పదో కెప్టెన్ గా కమిన్స్ రికార్డు సృష్టించాడు.
అతడి కంటే ముందు భార త మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ షాన్ పొలాక్, పాకిస్థాన్ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్, వెస్టిండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్లు ఈ ఫీట్ సాధించారు. కెప్టెన్గా వందకు పైగా వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో పాక్ మాజీ సారథి ఇమ్రాన్ ఖాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇమ్రాన్ 71 ఇన్నింగ్స్ లో 187 వికెట్లు తీశాడు. కపిల్ దేవ్ 58 ఇన్నింగ్స్ ల్లో 111 వికెట్లు తీయగా.. షాన్ పొలాక్ 50 ఇన్నింగ్స్ ల్లో 103 వికెట్లు పడగొట్టాడు.
కమిన్స్ నాయకత్వంలో ఆసీస్ సంచలన విజయాలు సాధించింది. 2023లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఓవల్ వేదికగా జరిగిన ఫైనల్లో భారత జట్టును ఓడించిన కమిన్స్ సేన టెస్టు గదను సొంతం చేసుకుంది. అనంతరం వన్డే వరల్డ్ కప్‌లోనూ టీమిండియను చిత్తు చేసి ఆరోసారి విశ్వ విజేతగా అవతరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com