Babar Azam Record : రికార్డు సృష్టించిన బాబర్ ఆజమ్

వరల్డ్‌కప్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ నిలిచారు. 17 ఇన్నింగ్స్‌ల్లోనే ఆయన 549 పరుగులు చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో ధోనీ(529-భారత్), విలియమ్సన్(527-న్యూజిలాండ్), జయవర్దనె(360-శ్రీలంక), గ్రేమ్ స్మిత్(352-దక్షిణాఫ్రికా) ఉన్నారు.
టీ20 వరల్డ్ కప్‌లలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లు వీళ్లే..
1. బాబర్ ఆజం - 549 (17 మ్యాచ్‌లు)
2. ఎంఎస్ ధోనీ - 529 (29 మ్యాచ్‌లు)
3. కేన్ విలియమ్సన్ - 527 (19 మ్యాచ్‌లు)
4.మహేల జయవర్ధనే - 360 (11 మ్యాచ్‌లు)
5. గ్రేమ్ స్మిత్ - 352 (16 మ్యాచ్‌లు).
ఐర్లాండ్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచులో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 106/9 చేసింది. ఛేదనలో పాక్ తడబడినప్పటికీ చివర్లో అబ్బాస్(17), షాహిన్(15) ఫర్వాలేదనిపించడంతో 18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయంతో టీ20 ప్రపంచకప్24లో గ్రూప్-ఏలో మూడో స్థానంతో పాక్ తన ప్రయాణాన్ని ముగించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com