Hardik Pandya : పాండ్యపై నిషేధం.. 2025లో ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్‌‌కు దూరం

Hardik Pandya : పాండ్యపై నిషేధం.. 2025లో ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్‌‌కు దూరం

ముంబై ఇండిన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యపై వేటు పడింది.ముంబైలోని వాంఖడే వేదికగా నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు స్లో ఓవర్ రేట్‌ నియమాన్ని ఉల్లంఘించింది. ఈ టోర్నీలో మూడోసారి స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు ఐపీఎల్ యాజమాన్యం హార్దిక్ పాండ్యకు రూ.30 లక్షలు జరిమానా విధించింది. దీంతోపాటు తరువాతి మ్యాచ్‌ ఆడకుండా నిషేధించింది. దీంతో హార్దిక్ 2025 IPLలో తన మొదటి మ్యాచ్‌కు దూరం కానున్నారు.

అలాగే, ముంబై జట్టులోని ప్లేయింగ్ 11లో ఉన్న వారికి రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించబడింది. హార్దిక్ ఈ సీజన్ లో బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమయ్యాడు. 14 మ్యాచ్‌లలో కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. బంతితో 11 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. హార్దిక్ తొలి సారి కెప్టెన్సీ చేప్పట్టిన ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్ ల్లో కేవలం నాలుగు మ్యాచ్ లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత లక్నో 20 ఓవర్లలో 214/6 స్కోరు చేసింది . కెప్టెన్ కేఎల్ రాహుల్ (41 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 55) ఫిఫ్టీతో రాణించాడు. ముంబై బౌలర్లలో నువాన్ తుషార, పియూష్‌‌‌‌‌‌‌‌ చావ్లా చెరో మూడు వికెట్లు తీశారు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో రోహిత్ శర్మ (38 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 68), నమన్ ధీర్ (28 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 నాటౌట్‌‌‌‌) పోరాడిపా లాభం లేకపోయింది. ముంబై 20 ఓవర్లలో 196/6 స్కోరు చేసి ఓడింది.

Tags

Next Story