Cricket News : బీసీసీఐ కీలక నిర్ణయం.. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా

బీసీసీఐ (BCCI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా దేశవాళీ క్రికెట్ ఆడాలని స్పష్టం చేసింది. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు సైతం రంజీల్లో ఆడాలని తేల్చి చెప్పి్ంది. ప్రస్తుతం మహిళలు దేశవాళీ వన్డే, టీ20 వైట్ బాల్ టోర్నీలు మాత్రమే ఆడుతున్నారు. ఆటగాళ్లు మరింత రాటు తేలేందుకు ‘రెడ్ బాల్ క్రికెట్ టోర్న’ ప్లాన్ చేస్తోంది.
నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నార్త్-ఈస్ట్ జోన్‌ల ఆధారంగా విభజించబడిన ఆరు జట్లు ఈ టోర్నమెంట్ లో పోటీ పడతాయి. టోర్నమెంట్ మార్చి 29 నుండి ప్రారంభం కానుంది. మార్చి 29, 30, 31 తేదీల్లో క్వార్టర్స్ పోటీ జరగనుంది. క్వార్టర్స్‌లో విజేతలుగా నిలిచిన జట్లు.. సెమీఫైనల్‌కు చేరుకుంటారు. రెండు సెమీ ఫైనల్ మ్యాచ్ లు ఏప్రిల్ 5 నుండి 7 వరకు జరిగే అవకాశం ఉంది.ఫైనల్ ఏప్రిల్ 9, 10 మరియు 11 తేదీల్లో జరుగుతుంది.
ఈ ఏడాది ఆరంభంలో భారత మహిళల జట్టు రెండు టెస్టు సిరీస్‌లు ఆడింది. స్వదేశంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో రికార్డు విజయంతో హర్మన్‌ప్రీత్ సేన చరిత్ర సృష్టించింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com