BCCI Rewards U-19 : వరల్డ్ కప్ విజేతలకు బీసీసీఐ నజరానా

అండర్-19 ఉమెన్స్ టీ20 టీమ్‌కు బీసీసీఐ రూ.5 కోట్ల బహుమతిని ప్రకటించింది. ఈ నగదును జట్టుతో పాటు స్టాఫ్‌కు అందించనున్నట్లు తెలిపింది. ఈరోజు జరిగిన అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 82 పరుగులకే ఆలౌట్ అవగా, భారత్ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్ కప్ గెలుచుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును మన తెలుగమ్మాయి గొంగడి త్రిష గెలుచుకున్నారు.
భారత్ అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన తెలుగమ్మాయి గొంగడి త్రిష ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ పురస్కారాన్ని తన తండ్రికి అంకితమిచ్చారు. ‘నన్ను ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు. మాజీ ప్లేయర్ మిథాలీరాజ్ నాకు ఆదర్శం. అండర్-19 వరల్డ్ కప్ భారత్‌ను వదిలి వెళ్లకూడదని అనుకున్నాను. నా బలాలపైనే దృష్టి పెట్టి ఆడాను. దేశానికి మరిన్ని మ్యాచులు ఆడి గెలవాలన్నది నా లక్ష్యం’ అని తెలిపారు.
అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్‌ను గెలుచుకున్న భారత జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన త్రిషపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి ప్లేయర్లు తెలంగాణకు గర్వకారణమని అన్నారు. మరింతగా రాణించి సీనియర్ జట్టులో స్థానం సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. నైపుణ్యమున్న ప్లేయర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com