Cricket : బీసీసీఐ సరైన పని చేసింది: యూసుఫ్ పఠాన్

Cricket : బీసీసీఐ సరైన పని చేసింది: యూసుఫ్ పఠాన్
X

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియాను పాకిస్థాన్ పంపించకుండా బీసీసీఐ సరైన పని చేసిందని మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ అభిప్రాయపడ్డారు. ‘బీసీసీఐ ఎప్పుడూ భారత ఆటగాళ్ల భద్రత గురించే ముందు ఆలోచిస్తుంది. ఆదాయం కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తుంది’ అని కొనియాడారు. వచ్చే ఏడాది పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండగా.. ఆ దేశంలో తమ మ్యాచుల్ని ఆడేది లేదని బీసీసీఐ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మొత్తం టోర్నమెంట్‌ను పాకిస్తాన్‌లో నిర్వహించాలన్న దృఢసంకల్పంతో ఉన్నది. కానీ తాజా పరిణామాలు ఈ నిర్ణయంపై కొంత మార్పు తెచ్చే అవకాశాలు చూపుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), PCB 2027 వరకు జరిగే టోర్నమెంట్లలో హైబ్రిడ్ మోడల్‌ను అనుసరించేందుకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు నివేదికలు వెలువడినాయి.

Tags

Next Story