India T20 World Cup Squad : టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

వెస్టిండీస్ మరియు యూఎస్ఏలో జరగబోయే టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది ఆటగాళ్ళతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టులో శివమ్ దూబే మరియు యుజ్వేంద్ర చాహల్‌లు ఎంపిక అయ్యారు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా మరియు హార్దిక్ పాండ్య డెప్యూటీగా ఉంటారు. బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్ ఉన్నారు.
వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్ మరియు సంజు శాంసన్ ఉన్నారు. కారు ప్రమాదం తర్వాత ఐపీఎల్‌లో తిరిగి వచ్చాన రిషబ్ పంత్ , 9 మ్యాచులలో 158 స్ట్రైక్ రేట్‌తో 350+ పరుగులు చేసి మంచి ఫార్మ్ కనబరిచాడు. సంజు శాంసన్ కూడా మంచి ఫార్మ్ లో ఉన్నారు.
స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మరియు యుజ్వేంద్ర చాహల్ ను ఎంపిక అయ్యారు. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ మరియు అర్షదీప్ సింగ్ ఎంపిక అయ్యారు.
ఐపీఎల్‌లో శివమ్ దూబే తన ప్రదర్శనతో రింకూ స్థానాన్ని ఆక్రమించాడు.
జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (ఉపకెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), సంజు శాంసన్ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.
రిజర్వు ప్లేయర్లు: శుబ్‌మాన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.
Tags
- Team India
- BCCI
- Rohit Sharma
- Hardik Pandya
- Virat Kohli
- Yashaswi Jaiswal
- Suryakumar Yadav
- Rishabh Pant
- Shivam Dubey
- Ravindra Jadeja
- Akshar Patel
- Kuldeep Yadav
- Yuzvendra Chahal
- Arshadeep Singh
- Jasprit Bumrah
- Mohammad Siraj
- Shubman Gill
- Rinku Singh
- Khaleel Ahmed
- Avesh Khan
- T20 World Cup Squad
- Cricket News
- Telugu News
- Tv5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com