Team India Head Coach : టీమ్ ఇండియా హెడ్‌ కోచ్‌ దరఖాస్తులకు బీసీసీఐ ఆహ్వానం

Team India Head Coach : టీమ్ ఇండియా హెడ్‌ కోచ్‌ దరఖాస్తులకు బీసీసీఐ ఆహ్వానం

భారత క్రికెట్ సీనియర్ పురుషుల జట్టు హెడ్ కోచ్‌ పోస్టుకు బీసీసీఐ దరఖాస్తుల్ని ఆహ్వానించింది. ఈ నెల 27న సాయంత్రం ఆరింటిలోపుగా అప్లికేషన్లు పంపించాలని ఓ ప్రకటనలో సూచించింది. దరఖాస్తుల వడబోత అనంతరం ఎంపికైన వారితో వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని వివరించింది. కోచ్‌ పదవీకాలం ఈ ఏడాది జూలై నుంచి 2027 డిసెంబరు 31 వరకు ఉంటుంది.

అలాగే హెడ్ కోచ్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారికి ఉండాల్సిన అర్హ‌త‌ల‌ను కూడా ఈ సంద‌ర్భంగా బీసీసీఐ వెల్ల‌డించింది. కనీసం 30 టెస్ట్ మ్యాచ్‌లు లేదా 50 వ‌న్డేలు ఆడి ఉండాలి. లేదా టెస్టు క్రికెట్ ఆడే దేశానికి ప్రధాన కోచ్‌గా కనీసం 2 సంవత్సరాల పాటు ప‌నిచేసిన అనుభ‌వం ఉండాలి. ఐపీఎల్‌ జట్టు లేదా సమానమైన ఇంటర్నేషనల్ లీగ్/ఫస్ట్ క్లాస్ జట్లకు/ జాతీయ A జ‌ట్లకు ప్రధాన కోచ్‌గా కనీసం మూడేళ్లు ప‌నిచేసి ఉండాలి.

లేదా బీసీసీఐ లెవల్ 3 సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. ఈ కండిష‌న్ల‌లో ఏది ఉన్నా స‌రే.. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అలాగే 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలని బీసీసీఐ తెలిపింది. ఇక పారితోషికం అనుభవాన్ని బ‌ట్టి ఉంటుంద‌ని పేర్కొంది.

Tags

Next Story