IPL 2024 : లక్నోకు బిగ్ షాక్.. మయాంక్ యాదవ్‌కు గాయం

IPL 2024 : లక్నోకు బిగ్  షాక్.. మయాంక్ యాదవ్‌కు గాయం

గుజరాత్‌ టైటాన్స్ తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ బౌలర్ మయాంక్ యాదవ్ (Mayank Yadav) గాయపడ్డారు. ఒక ఓవర్ వేసిన తర్వాత పక్కటెముకలు పట్టేయడంతో గ్రౌండును వీడారు. మళ్లీ గ్రౌండులో అడుగుపెట్టలేదు. వైద్యులు అతనికి వైద్యం అందించారు. ఈ ఒక్క ఓవర్లో అతను 140 కంటే తక్కువ వేగంతో బౌలింగ్ చేయడం విశేషం.

అంటే ఈ ఐపీఎల్‌లో మయాంక్ 145 నుంచి 150 వేగంతో బౌలింగ్ చేశాడు. మయాంక్ గాయం, తర్వాతి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంపై జట్టు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. అతను కోలుకోకపోతే లక్నోకు ఎదురుదెబ్బే. మ్యాచ్ తర్వాత మయాంక్‌తో మాట్లాడానని, బాగానే ఉన్నట్లు అనిపించిందని కృనాల్ తెలిపారు.

ఈ ఐపీఎల్‌లో మయాంక్ యాదవ్ గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి రికార్డు సృష్టించాడు. అలాగే ఇప్పటి వరకు 9 ఓవర్లు వేసిన మయాంక్ 54 పరుగులిచ్చి 6 వికెట్లు తీయగలిగాడు. దీంతో తన జట్టు తొలి రెండు మ్యాచ్‌ల్లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ గెలిచి ప్రత్యేక రికార్డు సృష్టించాడు.

Tags

Next Story