Bumrah : ఆర్సీబీపై బుమ్రా అరుదైన రికార్డు

వాంఖడేలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై బౌలర్ బుమ్రా 5 వికెట్లతో చెలరేగారు. ఈక్రమంలో 2సార్లు హ్యాట్రిక్ మిస్ కావడం గమనార్హం. ఈ ప్రదర్శనతో ఐపీఎల్‌లో ఆర్సీబీపై 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా బుమ్రా అవతరించారు. బుమ్రా 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు.
ఆర్సీబీపై ఇంతకుముందు ఛాంపియన్స్ లీగ్ లో షాన్ టెయిట్ 32 పరుగులకు 5 వికెట్లు తీసినా.. ఐపీఎల్లో మాత్రం గతంలో ఇది ఎవరికీ సాధ్యం కాలేదు. చివరిగా ఆశిష్ నెహ్రా సీఎస్కే తరఫున 4 వికెట్లు తీశారు. ఇప్పటి వరకు బెంగళూరుపై అదే అత్యుత్తమం. ఇక ఐపీఎల్‌లో రెండుసార్లు 5 వికెట్లు తీసిన ఫాల్క్‌నర్, ఉనాద్కత్, భువనేశ్వర్ సరసన బుమ్రా చేరారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీతో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 197 పరుగుల లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే చేధించింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ 69, సూర్య 52, రోహిత్ 38 రన్స్‌తో రాణించారు. ఈ సీజన్‌లో ముంబైకి ఇది రెండో విజయం కాగా ఆర్సీబీకి ఐదో ఓటమి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com