Shreyas Iyer : బాలీవుడ్ హీరోయిన్ తో శ్రేయస్ అయ్యర్ డేటింగ్?

టీమ్ ఇండియా యంగ్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ప్రేమలో పడ్డట్లు వార్తలొస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తో (Shraddha Kapoor) ఆయన రహస్య డేటింగ్ చేస్తున్నట్లు క్రికెట్, బాలీవుడ్ వర్గాల్లో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. వీరిరువురు ఇన్ స్టాగ్రామ్ లో ఒకరికొకరు ఫాలో చేసుకోవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
దీంతో నెటిజన్స్ వీరి మధ్య ఏదో ఉందని అప్పుడే అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 'వీళ్లు రహస్యంగా డేటింగ్ చేస్తున్నారా?' అని అభిమాని ఒకరు అంటుంటే.. అమ్మో...ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో జరుగుతుందని మరొకరు రాశారు. ఇక బాలీవుడ్ హీరోయిన్లు, స్టార్ క్రికెటర్ల మధ్య ప్రేమాయణం అనేది సర్వసాధారణమే.
ఇటీవలే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు కోల్పోయిన అయ్యర్.. మార్చి 2న తమిళనాడు తో ప్రారంభమైన రంజీ ట్రోఫీ 2024 సెమీ ఫైనల్‌లో ఆడాడు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో కేవలం మూడు పరుగులే చేసి సందీప్ వారియర్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో అయ్యర్ వరుసగా 35, 13, 27, 29 పరుగులు చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com