Kane Williamson : మూడోసారి తండ్రైన కేన్ విలియమ్సన్

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ (Kane Williamson ) మరోసారి తండ్రి అయ్యాడు. అతని సతీమణి సారా రహీమ్ (Sara Rahim) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేన్ విలియమ్సన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. తన భాగస్వామితో కలిసి తన నవజాత కుమార్తెను ఎత్తుకున్న ఆనందక్షణాల ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
'వరల్డ్ బ్యూటిఫుల్ గర్ల్‌కి స్వాగతం.. మీ సురక్షిత రాకకు, ముందుకు సాగుతున్న ఉత్తేజకరమైన ప్రయాణానికి కృతజ్ఞతలు' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. దీంతో ఫాన్స్, క్రికెటర్స్ విలియమ్సన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘కంగ్రాట్స్ లెజెండ్’ అని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశాడు.
కాగా కేన్ విలియమ్సన్ దంపతులకు ఇది మూడో సంతానం. విలియమ్సన్ జంటకు గతంలో 2019 లో మ్యాగీ అనే కుమార్తె జన్మించింది. అలాగే, మే 2022 లో మగబిడ్డకు జన్మనిచ్చారు. తండ్రి కాబోతున్న సందర్భరంగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ నుంచి కేన్ విలియమ్సన్ తప్పుకున్నాడు. ఫిబ్రవరి 29 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో కేన్ ఆడనున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com