Cricket : భారత్​ మ్యాప్​ తప్పుగా చూపి..న్యూజిలాండ్‌ జట్టుపై విమర్శలు

Cricket : భారత్​ మ్యాప్​ తప్పుగా చూపి..న్యూజిలాండ్‌ జట్టుపై విమర్శలు
X

భారత్‌పై న్యూజిలాండ్‌ తొలి టెస్ట్‌లో విజయం సాధించింది. ఈ క్రమంలోనే రెండో టెస్ట్‌కు సిద్ధమవుతున్న కివీస్‌ జట్టుపై నెట్టింట విమర్శలు తలెత్తున్నాయి. తమ ‘ఎక్స్‌’ ఖాతాలో భారత చిత్రపటాన్ని తప్పుగా చూపించడమే అందుకు కారణం. దీంతో వెంటనే ఆ పోస్టును తొలగించినట్లు తెలుస్తోంది. బెంగళూరు వేదికగా తొలి టెస్టులో భాగంగా భారత్‌తో పోటీ పడిన న్యూజిలాండ్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత తదుపరి టెస్టు కోసం పుణెకు బయలుదేరేందుకు కివీస్‌ జట్టు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా బెంగళూరు టూ పుణె అంటూ భారత చిత్రపటాన్ని షేర్‌ చేసింది. అయితే.. దీనిలో భారత సరిహద్దు భాగాన్ని తప్పుగా చూపించింది. కాసేపట్లోనే ఈ పోస్టు కాస్త వైరల్‌గా మారడంతో న్యూజిలాండ్‌ జట్టుపై విమర్శలు వచ్చాయి.వెంటనే అప్రమత్తమైన న్యూజిలాండ్‌ క్రికెట్‌ మేనేజ్‌మెంట్‌ ఆ పోస్టును తొలగించింది. కానీ, కివీస్‌ మాత్రం నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

Tags

Next Story