Rahul Dravid : పోయిన చోటే వెతుక్కున్న ద్రవిడ్.. మహోన్నత ఘనత..
వెస్టిండీస్ వేదికగా 2007లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో రాహుల్ ( Rahul Dravid ) సారథ్యంలోని టీమిండియా ఘోరవైఫల్యం చవిచూసింది. తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. కానీ 17 ఏళ్ల తర్వాత అదే గడ్డపై భారత్ టీ20 ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచింది.
రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో ఆ వైఫల్యాన్ని.. తాజా విజయాన్ని చాలామంది స్మరించుకుంటున్నారు. 90స్ కిడ్స్ కు ఇది మహోన్నత గెలుపు అన్నారు. జట్టు సారథిగా సాధించలేని ఘనత.. కోచ్ గా ద్రవిడ్ సాధించి అద్భుతమైన రికార్డ్ సాధించారని గొప్ప గొప్ప ప్లేయర్లు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (76; 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (47; 31 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) సత్తాచాటారు. మహరాజ్ (2/23), నోకియా (2/26) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లకు 169 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (52; 27 బంతుల్లో, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) పోరాడాడు. హార్దిక్ (3/20) మూడు వికెట్లు, బుమ్రా (2/18), అర్షదీప్ సింగ్ (2/20) చెరో రెండు వికెట్లతో విజృంభించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com