Afghanistan Coach : అఫ్గనిస్తాన్ కోచ్‌గా డ్వేన్ బ్రావో
టీట్వంటీ ప్రపంచకప్ లో సంచలనాలకు కేరాఫ్ అఫ్గనిస్థాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మెగా టోర్నీకి ముందు వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావోను బౌలింగ్ కన్సల్టెంట్ గా నియమించుకుంది. బ్రావోను బౌలింగ్ కన్సల్టెంట్ గా ఎంపిక చేశామని అఫ్గన్ బోర్డు ఎక్స్ వేదికగా వెల్లడించింది.
స్లో పిచ్ లు ఉండే విండీస్ గడ్డపై తమ బౌలింగ్ బృందానికి బ్రావో ఎంతో పనికొస్తాడని అఫ్ఘన్ బోర్డు గట్టిగా నమ్ముతోంది. గతంలో టీ20 ప్రపంచకప్ గెలిచిన విండీస్ జట్టులో బ్రావో ఉన్నాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లతో చరిత్ర బ్రావో పేరిటే ఉంది.
ఈ రైట్ ఆర్మ్ మీడియం పేసర్ కు ఐపీఎల్ లో కోచ్ గా సేవలందించిన ఎక్స్ పీరియస్ సేవలిందించిన అనుభవం ఉంది. ఇప్పటికే ఆఫ్గన్ బృందం విండీస్ చేరుకుంది. వారితో.. బ్రావో త్వరలోనే కలవనున్నాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com