IPL 2024 : కోహ్లీ ఆన్.. ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్..
ఆరు మ్యాచ్‌లలో ఓడిపోయి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న బెంగళూరు అనూహ్యంగా పుంజుకొన్న తీరు… ఈ ఐపీఎల్ కే హైలెట్. ఆశలు లేని స్థితి నుంచి, ఛాంపియన్ జట్టుగా అవతరించే స్థాయికి చేరుకొంది. ప్లే ఆఫ్ వరకూ బెంగళూరు సాగించిన ప్రయాణం… ఓ చరిత్ర గా చెప్పుకుంటున్నారు.
ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో బెంగళూరు తన ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడబోతోంది. కోహ్లీ, డూప్లెసెస్, రజత్ పడిదార్, దినేష్ కార్తీక్… ఇలా బెంగళూరు బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. మాక్స్‌వెల్ కూడా రెచ్చిపోతే… బెంగళూరు జోరుకు అడ్డుకట్ట వేయడం చాలా కష్టం. గ్రీన్ లాంటి ఆల్ రౌండర్ ఉండడం బెంగళూరుకు వరం. చివరి ఆరు మ్యాచ్‌లలో బెంగళూరు గెలవడానికి కారణం వాళ్ల పటిష్టమైన బౌలింగ్ విభాగం.
తొలి 9 మ్యాచ్‌లలో 8 గెలిచి, జోరు చూపించిన రాజస్థాన్ చివరి 5 మ్యాచ్‌లలో ఓడిపోయింది. లీగ్ దశలో బెంగళూరుని ఓడించిన రికార్డ్ ఉంది. కీలకమైన తరుణంలో బట్లర్ లేకపోవడం రాజస్థాన్‌కు లోటే. సంజూ శాంసన్, జైస్వాల్, పరాగ్, హిట్మయర్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అశ్విన్, చాహల్, బౌల్ట్ తో కూడిన బౌలింగ్ విభాగం అత్యంత పటిష్టంగా తయారైంది. మ్యాచ్ లో కోహ్లీ పేరు మార్మోగడం ఖాయంగా కనిపిస్తోంది. హయ్యెస్ట్ వ్యూస్ వచ్చే చాన్స్ ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com