Ben Stokes : ఇంగ్లండ్ కు బిగ్ షాక్.. వైదొలిగిన బెన్ స్టోక్స్

టీ20 వరల్డ్ కప్ కు ముందు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ కు భారీ షాక్ తగిలిం ది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (Ben Stokes) సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. జూన్ లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ నుంచి తాను వైదొలు గుతున్నట్లు స్టోక్స్ ప్రకటించాడు. అయితే టెస్టు క్రికెట్ పై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
సుదీర్ఘ ఫార్మాటికే తన మొదటి ప్రాధాన్యత అని అందుకే టెస్టు ల్లో పూర్తి స్థాయి ఆల్రౌండర్గా సేవలందించడం కోసం వరల్డ్ కప్ నుంచి తప్పుకో వాలని నిర్ణయం తీసుకున్నట్లు స్టోక్స్ వివరించాడు. కాగా, ఇంగ్లండ్ ఈ ఏడాది సుదీ ర్ఘ ఫార్మాట్ క్రికెట్ తో బిజీ బిజీగా ఉంది. ఈ క్యాలెండర్ ఇయర్లో ఇంగ్లండ్ జట్టు మొత్తం 12 టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది.
పొట్టి వరల్డ్ కప్ ముగియగానే జులైలో వెస్టిండీస్ తో ఇంగ్లండ్ టెస్ట్ ప్రయాణం మొదలవుతుంది. అనంతరం సొంతగడ్డపై టీమిండి యాతో టెస్ట్ సిరీస్ ఆడనుంది. దీని తర్వాత ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ఇలా ఒకటి తర్వాత మరో సిరీస్లో ఇంగ్లండ్ షెడ్యూల్ బిజీగా ఉంది. అయితే ఇటీవల భారత్ గడ్డపై జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ 4-1తో చిత్తుగా ఓడింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com