India and England First T20 : భారత్‌తో తొలి టీ20.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన

India and England First T20 : భారత్‌తో తొలి టీ20.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన
X
India and England First T20

భారత్, ఇంగ్లండ్ మధ్య రేపటి నుంచి 5 మ్యాచుల టీ20 సిరీస్ జరగనుంది. రేపు తొలి మ్యాచ్ కోల్‌కతా వేదికగా రా.7 గంటలకు ప్రారంభం అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, హాట్ స్టార్ యాప్‌లో లైవ్ చూడవచ్చు. తర్వాతి మ్యాచులు ఈనెల 25 (చెన్నై), 28 (రాజ్‌కోట్), 31 (పుణే), ఫిబ్రవరి 2(ముంబై) తేదీల్లో జరగనున్నాయి. 3 మ్యాచుల వన్డే సిరీస్ (నాగ్‌పూర్, కటక్, అహ్మదాబాద్) ఫిబ్రవరి 6 నుంచి జరగనుంది.

భారత్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రేపు జరిగే తొలి టీ20 కోసం ఇంగ్లండ్ జట్టును ప్రకటించింది. బట్లర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, సాల్ట్(కీపర్), డక్కెట్, బ్రూక్, లివింగ్ స్టోన్, బెథెల్, ఓవర్టన్, అట్కీన్‌సన్, అర్చర్, రషీద్, వుడ్ జట్టులో ఉండనున్నారు. ఈ మేరకు జట్టును కోచ్ మెక్‌కల్లమ్ ప్రకటించారు.

తొలి టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను విజ‌యంతో ఆరంభించాల‌ని ఇరు జ‌ట్లు పట్టుద‌లతో ఉన్నాయి. ఈ క్ర‌మంలో కోల్‌క‌తా టీ20కు ఇంగ్లండ్ క్రికెట్‌ త‌మ ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను ప్ర‌క‌టించింది. మొద‌టి టీ20లో ఇంగ్లండ్ న‌లుగురు ఫాస్ట్ బౌల‌ర్ల‌తో బ‌రిలోకి దిగ‌నుంది. పేస్ బౌల‌ర్ల‌లో కోటాలో మార్క్‌వుడ్‌, జోఫ్రా ఆర్చర్, జామీ ఓవ‌ర్‌ట‌న్, గుస్ అట్కిన్సన్‌లకు చోటు ద‌క్కింది.

Tags

Next Story