Cricket : స్పెషల్ కోచ్ వచ్చినా.. పాక్ కథ మారలేదు!

భారత్‌పై గెలవడానికి స్పెషల్ కోచ్‌ను నియమించుకున్నా పాక్ కథ మారలేదు. రెగ్యులర్ కోచ్ అకిబ్ జావెద్‌ను కాదని మాజీ ఆటగాడు ముదస్సర్ నాజర్‌ను నియమించుకొని ఆ జట్టు వ్యూహాలు రచించింది. సాధారణంగా పేస్ దళంతో బలంగా కనిపించే పాక్ నిన్నటి మ్యాచ్‌లో బంతితోనూ ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోయింది. స్పెషల్ కోచ్ ఇచ్చిన సూచనలు వర్కౌట్ కాలేదో? లేక హై ఓల్టేజ్ కావడంతో ఒత్తిడి తట్టుకోలేకపోయిందో? తెలియదు కానీ ఘోరంగా ఓడింది.
ఇక భారత్, పాక్ మధ్య నిన్న జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్ వ్యూస్ పరంగా నంబర్-1గా నిలిచింది. జియోహాట్‌స్టార్‌లో దాయాదుల పోరుకు 60.5 కోట్ల వ్యూస్ వచ్చాయి. పాకిస్థాన్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సమయంలో 6.8కోట్లు ఉన్న వ్యూస్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసి మ్యాచ్‌ను గెలిపించే సమయానికి 60.5కోట్లకు చేరి రికార్డ్ సృష్టించింది. గతంలో ఏ క్రికెట్ మ్యాచ్‌కూ ఇన్ని వ్యూస్ రాలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-ఏ పాయింట్ల టేబుల్‌లో భారత్ టాప్ ప్లేస్‌కి చేరింది. ఆడిన 2 మ్యాచ్‌ల్లో గెలిచి 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత న్యూజిలాండ్ ఒక మ్యాచ్ ఆడి 2 పాయింట్లతో రెండో స్థానంలో, ఒక మ్యాచ్‌లో ఓడిన బంగ్లా మూడో ప్లేస్‌లో ఉన్నాయి. ఇక కివీస్, భారత్ చేతిలో ఓడిన పాక్ 0 పాయింట్ల(NRR -1.087)తో అట్టడుగు స్థానానికి పడిపోయింది. లీగ్ దశ ముగిసేలోపు టాప్-2లో ఉన్న జట్లు సెమీస్ వెళ్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com