IPL 2024 : ఐపీఎల్ 2024.. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు కెప్టెన్లకు ఫైన్

ఒకే మ్యాచ్‌లో ఇద్దరు కెప్టెన్లకు ఫైన్ పడింది. నిన్న చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదైంది. నిర్ణీత సమయానికి బౌలింగ్ వేయకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లకు బీసీసీఐ రూ.12లక్షల చొప్పున ఫైన్ విధించింది. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. లక్నో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్, చెన్నై కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లోచెన్నై పై 8 వికెట్ల తేడాతో లక్నో గెలిచింది. 177 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. కేఎల్ రాహుల్ 82, డికాక్ 54 రాణించారు. ముస్తాఫిజుర్, పతిరణ చెరో వికెట్ తీశారు. చెన్నై బ్యాటర్లలో జడేజా 57, రహానే 36, అలీ 30, ధోనీ 28 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో కృనాల్ 2, స్టొయినిస్, బిష్ణోయ్, మోసిన్ ఖాన్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com