Datta Gaekwad : మాజీ క్రికెటర్ దత్తా గైక్వాడ్ కన్నుమూత

Datta Gaekwad : మాజీ క్రికెటర్ దత్తా గైక్వాడ్  కన్నుమూత
X

భారత మాజీ క్రికెటర్ దత్తా గైక్వాడ్ కన్నుమూశారు. 2024 ఫిబ్రవరి 13 మంగళవారం తెల్లవారుజామున ఆనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 95 సంవత్సరాలు. భారత్ క్రికెటర్లలో అత్యంత వృద్ధుడిగా ఆయన పేరుపొందారు. 1928, అక్టోబర్ 27న గుజరాత్ లోని వదోదరలో జన్మించారు దత్తా గైక్వాడ్ . భారత్ తరఫున 11 టెస్టు మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించారు.

1952, 1959లో ఇంగ్లాండ్, 1952-53లో వెస్టీండీస్ పర్యటనలకు వెళ్లిన జట్లలో సభ్యుడిగా ఉన్నారు. 1959లో భారత జట్టుకు నాయకత్వం కూడా వహించాడు. 52 పరుగులే ఆయన టెస్ట్ కెరీర్ లో సాధించిన ఏకైక అర్థసెంచరీ. దత్తా గైక్వాడ్ రంజీ ట్రోఫీలో 14 శతకాలతో 3 వేల 139 పరుగులు సాధించాడు.

రంజీలో అతని అత్యధిక స్కోరు 249 పరుగులు. ఇవి 1959-60లో మహారాష్ట్రపై చేశారు. స్పీన్ బౌలరైన గైక్వాడ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 25 వికెట్లు కూడా తీశారు. భారత క్రికెట్ జట్టుకు ఓపెనర్‌గా సేవలందించిన అంశుమన్ గైక్వాడ్ ఈయన కుమారుడే. . గైక్వాడ్ తన 95వ పుట్టినరోజును అక్టోబర్ 27, 2023న జరుపుకున్నారు. దత్తా గైక్వాడ్ మృతి పట్ల క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Tags

Next Story