Cricket News : పాకిస్థాన్ మాజీ కెప్టెన్ కన్నుమూత

Pakistan : పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అహ్మద్ (86) అనారోగ్యంతో కన్నుమూశారు. 1958-1973 మధ్య ఆయన పాక్ తరఫున 41 టెస్టులు ఆడి 2,991 పరుగులు చేశారు. ఈ క్రమంలో 5 సెంచరీలు సాధించిన ఆయన, అందులో 3 భారత్‌పైనే నమోదు చేశారు. ఆఫ్ స్పిన్ వేసే సయీద్ తన టెస్ట్ కెరీర్‌లో మొత్తం 22 వికెట్లు పడగొట్టారు.
ఇంగ్లండ్‌తో జరిగిన 3 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించారు. సయీద్ 1937లో జలంధర్‌లో అప్పటి బ్రిటిష్ ఇండియాలో జన్మించాడు . స్వల్ప అనారోగ్యంతో లాహోర్‌లో 86 సంవత్సరాల వయస్సులో అహ్మద్ మరణించారు. రిటైర్మెంట్ తర్వాత, సయీద్ క్రికెట్‌కు దూరమయ్యాడు, మళ్లీ క్రీడలో పని చేయలేదు. అతను లాహోర్‌లో చాలా సంవత్సరాలు ఒంటరిగా జీవించాడు,
సయీద్ అహ్మద్1958, జనవరి 17న వెస్టిండీస్‌తో బ్రిడ్జ్‌టౌన్‌లో టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేశాడు. 1968-69లో డ్రా అయిన మూడు టెస్టులకు కెప్టెన్‌గా కొనసాగాడు. 1972లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టుకు వెన్ను గాయం కారణంగా అతను అనర్హుడని ప్రకటించడంతో ఇతని కెరీర్ వివాదాస్పద పరిస్థితుల్లో ముగిసింది.
పాకిస్తాన్ దౌత్యవేత్త షహర్యార్ ఖాన్ బంధువైన ప్రఖ్యాత వ్యాపారవేత్త బేగం సల్మాతో అహ్మద్ వివాహం జరిగింది. తరువాత వ్యాపారంలో నిమగ్నమయ్యాడు. 1980లో క్రికెట్, వ్యాపార వృత్తిని విడిచిపెట్టి తబ్లిఘి జమాత్‌లో బోధకుడిగా చేరాడు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com