Retirement : రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ మాజీ కెప్టెన్

పాకిస్థాన్ మహిళా జట్టు మాజీ క్రికెటర్ బిస్మా మరూఫ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 2006లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బిస్మా.. పాకిస్థాన్ తరఫున వన్డేలు, టీ20ల్లో అత్యధిక పరుగులు చేశారు. 136 వన్డేల్లో 3369 రన్స్, 44 వికెట్లు.. 146 టీ20ల్లో 2893 రన్స్, 36 వికెట్లు పడగొట్టారు. బిస్మా 96 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించారు.
నా 17 ఏళ్ల ప్రయాణం ఎన్నో సవాళ్లు, విజయాలు, మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉంది. నా క్రికెట్ ప్రయాణంలో అరంగేట్రం నుంచి ఇప్పటి వరకు నాకు మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నాపై నమ్మకం ఉంచి, జట్టును నడిపించే బాధ్యతను తనకు అప్పగించినందుకు పీసీబీకి ప్రత్యేక ధన్యవాదాలు. చివరగా నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని" బిస్మా పేర్కొన్నట్లు పీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది.
2006లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన మరూఫ్ తన 17 ఏళ్ల పాటు పాకిస్తాన్ క్రికెట్ కు తన సేవలు అందించడంలో ఎప్పుడు ముందుండేది. బిస్మా మరూఫ్ పాకిస్తాన్ జట్టు తరపున వన్డేలు, టీ20 లలో అత్యధిక పరుగులు చేసిన రికార్డులు ఇప్పటికి ఆమె పేరునే ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com